కరోనా నుండి పూర్తిగా కోలుకున్న నారా లోకేష్
- PRASANNA ANDHRA

- Jan 23, 2022
- 1 min read
టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ కరోనా నుండి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు, ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు, ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులందరికీ కృతజ్ఞతలు అని. తన జన్మదినం సందర్భంగా జనహితమైన కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులకు సేవాగుణానికి హ్యాట్సాఫ్ అని పొగిడారు. నాయకులు కార్యకర్తలు అందరి ఆకాంక్షలు, పూజలు, ప్రార్థనలు, వైద్యుల సూచనల ఫలితంగా తాను కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగలిగాను అని. అందరి అభిమానమే తన ఆరోగ్యం అని. కార్యకర్తల ఆదరణే నా బలం. సదా మీ ప్రేమకు నేను బానిసను అని ఆయన ట్వీట్ చేశారు.









Comments