నంగనూరుపల్లెలో గడప గడప కార్యక్రమం
- PRASANNA ANDHRA

- Nov 20, 2022
- 1 min read
నంగనూరుపల్లెలో గడప గడప కార్యక్రమం


వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరు మండలం నంగునూరు పల్లి గ్రామంలో సర్పంచ్ లక్ష్మీదేవి, యాలం శంకర్ యాదవ్, ఎంపీటీసీ కృష్ణపాటి సంధ్య, మాజీ సర్పంచ్ మేకల సుబ్బరామయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నంగునూరు పల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే రాజమల్లుకు అడుగడుగున పూలమాలలతో సన్మానిస్తూ భారీ ఎత్తున బాణాసంచా పేల్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి గడపకు తిరిగి సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకుని గ్రామాభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పలు సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడి ప్రీ స్కూల్ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు, గర్భవతులకు అందించవలసిన పౌష్టికాహారం సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎంపీపీ శేఖర్ యాదవ్, టిటిడి పాలకమండలి సభ్యులు టంగుటూరు మారుతి ప్రసాద్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాలం తులసమ్మ వైసీపీ నాయకులు యాలం శంకర్ యాదవ్, పలువులు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు వైసిపి నాయకులు వైసిపి కార్యకర్తలు గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








Comments