అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించిన నంద్యాల కొండారెడ్డి
- EDITOR

- Nov 28
- 1 min read
అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించిన నంద్యాల కొండారెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట మున్సిపల్ హై స్కూల్ నందు మధ్యాహ్న భోజనం వికటించి పది మంది విద్యార్థులు కడుపునొప్పి వాంతులతో స్థానిక 350 పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స కొరకు చేరగా, రాష్ట్ర టిడిపి కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, యువ నాయకులు బచ్చల ప్రతాప్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను, తల్లిదండ్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే డ్యూటీలో ఉన్న డాక్టర్లను సరైన చికిత్స, మెరుగైన వైద్యం అందించాలని, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం తెలపాలని కోరారు. మధ్యాహ్న భోజనం వికటించకడానికి గల కారణాలను పాఠశాల అధ్యాపకులను అడిగి తెలుసుకుని, ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.









Comments