అనాథ శరణాలయంలో మిఠాయిలు పంపిణీ!
- PRASANNA ANDHRA

- Jun 12, 2024
- 1 min read
అనాథ శరణాలయంలో మిఠాయిలు పంపిణీ!


రాష్ట్రంలో వైసిపి పాలనకు అంతం పలికి నాల్గవసారి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా పట్టణ నందమూరి యువ సేవా సమితి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, స్థానిక విద్యార్థి అనాథ శరణాలయంలోని బాల బాలికలకు మిఠాయిలు పంపిణీ చేసారు.

కార్యక్రమంలో నందమూరి యువ సేవా సమితి అధ్యక్షుడు గోమేధికమ్ సుదర్శన్, ఉపాధ్యక్షుడు సిజె.వెంకట సుబ్బయ్య, గౌరవాధ్యక్షుడు డా.వీరాంజనేయులు, కడప పార్లమెంటరీ ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్.మల్లికార్జున, కడప పార్లమెంటరీ బిసి సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పి.సుబ్బరాజు, నందమూరి యువ సేవా సమితి కార్యదర్శులు సిజె.సమర, డా.మచ్చా నాగభూషణం(అఖండ), గంగుల కృష్ణ చైతన్య రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎ.ఆంజనేయులు, కె.దస్తగిరి, ఎన్.సుబ్బయ్య, ఎస్.మురళి, సతీష్, అనాథ శరణాలయ నిర్వాహకుడు విజయభాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










Comments