top of page

ఘనంగా నల్లబోతుల 43వ పుట్టినరోజు వేడుకలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 29, 2022
  • 1 min read

ఆనందోత్సాహాల నడుమ నల్లబోతుల 43వ పుట్టినరోజు వేడుకలు

ree

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధికి నల్లబోతుల నాగరాజు 43వ పుట్టినరోజు వేడుకలకు ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, నల్లబోతుల యువత పాల్గొనగా, నల్లబోతుల నాగరాజు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఆనందోత్సహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి, మహిళా పట్టణాధ్యక్షురాలు భోగాల లక్ష్మి నారాయణమ్మ, యువ నాయకుడు సూర్య ప్రతాప్ రెడ్డి, వాల్మీకి కుల సంఘ నాయకులు, తదితరులు ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు.

ఈ సందర్బంగా టీడీపీ ఇంచార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పూలమాలతో నాగరాజును సత్కరించి, పార్టీ కొరకు అహర్నిశలు శ్రమిస్తూ, కష్ట కాలంలో కూడా ముందుండి సేవలందించిన నాగరాజును తాము ఎన్నడూ మరువమని. అటు టీడీపీ తెలుగు యువత నాయకుడిగా ఇటు బీసీ నాయకుడిగా తన వొంతు బాధ్యతలు నిర్వహిస్తున్న నాగరాజు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించ్చారు.

నల్లబోతుల నాగరాజు మాట్లాడుతూ, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని, 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగురవేసే దిశగా తాను తన అనుచరవర్గం కృషి చేసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ధీమా వ్వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నల్లబోతుల యువసేన కార్యకర్తలకు, అభిమానులకు విందును ఏర్పాటు చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page