top of page

మిషన్ రాయలసీమ సమన్వయకర్తగా నల్లబోతుల నాగరాజు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 23, 2023
  • 1 min read

మిషన్ రాయలసీమ సమన్వయకర్తగా

నల్లబోతుల నాగరాజు

ree

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటుచేసిన మిషన్ రాయలసీమ కడప జిల్లా సమన్వయకర్తగా రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజును నియమించారు. రాయలసీమలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో రాయలసీమ ప్రాంత వాసుల కష్టాలను తెలుసుకున్న నారా లోకష్ మిషన్ రాయలసీమ పేరుతో టిడిపి అధికారం చేపట్టిన వెంటనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి సీమ అభివృద్ధి బాటలో పయనించేందుకే మిషన్ రాయలసీమ పనిచేస్తుంది. మిషన్ రాయలసీమ ప్రణాళికను సమన్వయం చేసుకునేందుకు రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధులకు చోటు కల్పిస్తూ కడప జిల్లాకు ముగ్గురు సమన్వయకర్తలను నియమించింది. అందులో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ లు జియావుద్దీన్, రవితేజా రెడ్డి లను నియమించారు. తనపై ఎంతో నమ్మకంతో మిషన్ రాయలసీమ సమన్వయకర్తగా నియమించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు గారికి ప్రొద్దుటూరు ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు నల్లబోతుల నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ రాయలసీమ ను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరికి కరపత్రాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పార్టీ ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page