top of page

ముస్లిం కమ్యూనిటీ హాల్ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 20, 2023
  • 1 min read

ree

ముస్లిం కమ్యూనిటీ హాల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

ree

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పట్టణములోని ముస్లిం కమ్యూనిటీ హాల్ నందు శుక్రవారం ఉదయం ముస్లిం కమ్యూనిటీ హాల్ ప్రధాన కార్యదర్శి అహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాజరు అవగా, కౌన్సిలర్లు ఇర్ఫాన్ బాషా, ఇబ్రహీం ఖలీలుల్లాహ్, 25వ వార్డు వైసీపీ ఇంచార్జి నూరి, 18వ వార్డు ఇంచార్జి రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి, గౌరవ సన్మానం చేశారు. నూతన కమిటీ నందు అధ్యక్షుడిగా ఉప్పలూరు ఖలంధర్, ఉపాధ్యక్షులుగా సి. జిలాన్ బాషా, వడ్ల షేక్ దాదాపీర్ లను, ప్రధాన కార్యదర్శిగా ఎస్. అహమ్మద్ హుస్సేన్, జాయింట్ సెక్రెట్రీలుగా అబ్దుల్ జలీల్, అహమ్మద్ హుస్సేన్ లను, కోశాధికారిగా షేక్ రహమతుల్లా, కమిటీ మెంబర్లుగా షేక్ అబ్దుల్ బషీర్, సి. ఖాజా మొయినుద్దీన్, 23వ వార్డు కౌన్సిలర్ ఇబ్రహీం ఖలీలుల్లాహ్, షేక్ రియాజ్ అహమ్మద్, కడప ఎస్దాన్, ఇబ్రహీం ఖలీలుల్లాహ్, సి. మహమ్మద్ ఘయాస్ తదితరులను ఎన్నుకొన్నారు.

ree

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, ముందుగా నూతన కమిటీ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియచేసారు. ప్రత్యేకించి ఇక్కడి కమిటీ హాలు కులాలకు మతాలకు అతీతంగా సామాజిక సేవా దృఖ్పధంతో దాతలు పేదల కొరకు నిర్మించారని, పేదలకు వివాహాది శుభకార్యాలకు ఉచితంగా ఇస్తున్నారని కొనియాడారు. కమిటీ హాల్ సభ్యులు చేసే సామాజిక సేవలో తన వొంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని, నూతన పాలకవర్గ అభ్యర్ధన మేరకు మరో కమ్యూనిటీ హాలు నిర్మించే క్రమంలో తన వొంతు ఆర్ధిక సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం నూతన పాలకవర్గ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాచమల్లును ఘనంగా సత్కరించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page