మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభస
- EDITOR

- 6 days ago
- 1 min read
మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభస

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు అనుమతి లేకుండా సిసి ఓబులేసు ను మరో సెక్షన్ కు బదిలీ చేశారంటూ మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మున్సిపల్ చైర్ పర్సన్ అనుమతి లేకుండా సిబ్బందిని ఎలా మార్పు చేస్తారంటూ ప్రశ్నించారు? ఇందుకు సమాధానంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, తన పరిధిలో ఉన్న సిబ్బందిని ఏ సెక్షన్ కైనా మార్పు చేసే అధికారం తనకుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్, వైసీపీ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ సమావేశం నుంచి వెళ్లిపోవటానికి సిద్ధం అవగా ఆయనను వైసిపి కౌన్సిలర్ సభ్యులు అలాగే ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ నందు కమిషనర్ రవిచంద్ర రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి సిసి ఓబులేసు పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం రీజనల్ ఆర్డీకి నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. తనకు తెలియకుండా కౌన్సిల్ అజెండాను రూపొందించి సభ్యులకు అందజేశారని, కౌన్సిల్ సభ్యులు అజెండాలోని అంశాలు ఏవైనా ప్రశ్నిస్తే తాను ఏ సమాధానం చెప్పాలని మున్సిపల్ కమిషనర్ అన్నారు.
ఇదిలా ఉండగా మున్సిపల్ చైర్ పర్సన్ భీమనపల్లి లక్ష్మీదేవి నాగరాజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కమిషనర్ తనపై వ్యవహరించిన తీరును తప్పు పట్టారు. తాను సిసిని ఎందుకు మార్పు చేశారని ప్రశ్నించగా కమిషనర్ తన క్రింది స్థాయి సిబ్బందిని సీసీలుగా నియమించుకునే అవకాశం ఉందని చెప్పారన్నారు. అజెండాలో పొందుపరిచిన 22 అంశాలలో రెండు అంశాలు తిరస్కరించామని మిగిలిన 20 అంశాలు ఆమోదించామని తెలిపారు.








Comments