మాతమ్మ గుళ్ళ నిర్మాణానికి ముక్కా ట్రస్ట్ ఆర్థిక సాయం.
- DORA SWAMY

- Aug 11, 2022
- 1 min read
ఆపద అవసరాలకు పేదలకు సహకరించడమే మా సంస్థ లక్ష్యం.
ముక్కా రూపానంద రెడ్డి.

ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ద్వారా పేదలకు సహకరించడం, గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మా వంతుగా సహకరించడమే మా సంస్థ లక్ష్యమని ముక్కారూపానందరెడ్డి పేర్కొన్నారు.

ఈ రోజు తన క్యాంపు కార్యాలయం నందు మాతమ్మ గుడులను నిర్మించేందుకై బాధితులు ముందుకు రాగా రూపానంద రెడ్డి ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు చెక్కును అందజేశారు. ఓబులవారిపల్లి మండలంలోని బోటిమీద పల్లె పంచాయతీ కాకర్ల వారి పల్లె గ్రామంలోని అరుంధతి వాడ మాతమ్మ గుడికి 50 వేల రూపాయలు, పుల్లంపేట మండలం రెడ్డిపల్లె దళితవాడ గ్రామంలోని మాతమ్మ గుడి కి 50 వేల రూపాయలు మొత్తం లక్ష రూపాయలు చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరవ శ్రీధర్, వైయస్సార్ పార్టీ నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి, బత్తిన వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








Comments