top of page

లివర్ వ్యాధిగ్రస్తునికి ముక్కా సాయి వికాస్ రెడ్డి 30 వేల ఆర్థిక సాయం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 25, 2023
  • 1 min read

లివర్ వ్యాధిగ్రస్తునికి ముక్కా సాయి వికాస్ రెడ్డి 30 వేల ఆర్థిక సాయం.

ree

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం తిమ్మయ్య గారి పల్లి పంచాయతీకి చెందిన మోడపోతుల నరసింహులు గత కొద్దిరోజులుగా లివర్ వ్యాధితో ఇబ్బంది పడుతుండగా.. విషయం తెలుసుకున్న ఓబులవారిపల్లి మండలం ముక్కా ఫౌండేషన్ అధినేత ముక్కా రూపనంద రెడ్డి కుమారుడు సాయి వికాస్ రెడ్డి చికిత్స నిమిత్తం సోమవారం 30000 ఆర్థిక సాయంను చెక్కు రూపంలో బాధితుడు నివాసంలో నరసింహులు కి అందించారు.

ree

అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని బాధితునికి సాయి వికాస్ రెడ్డి సూచించారు. కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. అవసరాన్ని గుర్తించి సాయం చేసిన ముక్క ఫౌండేషన్ అధినేతకు, వారి కుమారుడు సాయి వికాస్ రెడ్డికి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తిన వేణుగోపాల్ రెడ్డి, సాలవ రమణ రాజు, ప్రతాప్, పరశురామ్ లు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page