హరిత విప్లవ పితామహుడు కన్నుమూత.
- DORA SWAMY

- Sep 28, 2023
- 1 min read

భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు, హరిత విప్లవ పితామహుడు ఎమ్ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. 1925 ఆగష్టు 7వ తేదీన జన్మించిన ఆయన పద్మశ్రీ, పద్మ విభూషణ్, రామన్ మెగసెసె వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆయన మృతిపట్ల దేశంలోని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.








Comments