ఎంపీపీ శేఖర్ యాదవ్ నందవరం పాదయాత్ర
- PRASANNA ANDHRA

- Oct 30, 2023
- 1 min read
ఎంపీపీ శేఖర్ యాదవ్ నందవరం పాదయాత్ర

కడప జిల్లా, ప్రొద్దుటూరు
పేద, బడుగు బలహీనవర్గాల ఆర్థిక స్వావలంబనకు రాష్ట ప్రజలకు సకాలంలో సంక్షేమ పథకాలు అందాలన్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని, అలాగే గత ముప్పై సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రానున్న ఎన్నికలలో మూడవ మారు ఎమ్మెల్యే గా గెలుపొంది నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ, ప్రొద్దుటూరు ఎంపీపీ శేఖర్ యాదవ్ పట్టణంలోని రామేశ్వరం మోరీల వద్ద ఉన్న చౌడమ్మ ఆలయం వద్ద నుండి నందవరం చౌడమ్మ దేవస్థానం వరకు సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. ఉదయం ఎమ్మెల్యే రాచమల్లు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా చౌడమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం జండా వూపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర ప్రతి రోజు 23 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని, గురువారం రాత్రి సమయానికి నందవరం చేరనుంది. కార్యక్రమంలో ప్రొద్దుటూరు వైసిపి నాయకులు, కార్యకర్తలు, రాచమల్లు అభిమానులు పెద్దయెత్తున పాల్గొన్నారు.









Comments