top of page

యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మిథున్ రెడ్డి. ఎల్ వి మోహన్ రెడ్డి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 11, 2022
  • 1 min read

చిట్వేలి లో ఘనంగా ఎంపీ మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు.

పాల్గొన్న వైసిపి శ్రేణులు- పేదలకు అన్నదానం.

ree

భారత లోక్ సభ ప్యానల్ స్పీకర్, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం మండల వైసీపీ సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని అందరికీ పంచారు. ఈ సందర్భంగా ఎల్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించి; ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతూ అలుపెరగని ప్రజా నాయకుడిగా మిథున్ రెడ్డి పేరు పొందారని, తాను రాబోవు రోజుల్లో మరెన్నో రాజకీయ పదవులు అలంకరించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వారన్నారు.

ree

తదుపరి మానవతా బాధ్యులు మునిరావు ఆధ్వర్యంలో మధ్యాహ్నం పెద్ద ఎత్తున పేదలందరికీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చంద్ర, వైసిపి నాయకులు చౌడవరం భాస్కర్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, ఎల్.విసురేంద్రారెడ్డి, ఎల్.వి వేణుగోపాల్ రెడ్డి, ఎం కనకరాజా, కోదండరామయ్య, పెంచల్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, గంగిరెడ్డి, ప్రసాద్, చెంచయ్య, రవి, జాకీర్,ఎంపీటీసీలు కోటయ్య, గుండయ్య, కృష్ణయ్య, సర్పంచ్ బాలు, సోషల్ మీడియా ప్రతినిధి గణేష్, వైసీపి పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page