ఎంపీ సియం రమేష్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖులు
- EDITOR

- 7 hours ago
- 1 min read
ఎంపీ సియం రమేష్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖులు

వైయస్సార్ కడప జిల్లా
కడప జిల్లా ఎర్రగుంట్ల పొట్లదుర్తి గ్రామంలో అనకాపల్లి ఎంపీ సియం రమేష్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖులు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అనకాపల్లి ఎంపీ సియం రమేష్ నాయుడు తల్లి చింతకుంట రత్నమ్మ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి సంతాపం వ్యక్తం చేసినవారిలో కేంద్రమంత్రి కమలేష్ పాస్వాన్, తెలంగాణా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఎంపిలు పుట్టా మహేశ్, లావు కృష్ణదేవరాయలు, సంజయ్ జైస్వాల్, బోలా సింగ్, నీరజ్ శేఖర్, దీపక్ సింక్, అంకునద్ దూబే పరామర్శించారు.అలాగే తమిళనాడు మంత్రి గాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త జిఎంఆర్ అధినేత రాజు కూడా రమేష్ నాయుడు కుటుంబ సభ్యులను కలుసుకుని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.








Comments