ప్రజలకు టీడీపీ అసత్యాలు చెబుతోంది - ఎంపి అవినాష్
- PRASANNA ANDHRA

- May 20, 2022
- 1 min read
కడప జిల్లా, గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల అద్భుతమైన స్పందన వస్తుందని ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని, సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని కొనియాడారు.
కమలాపురం పర్యటన లో చంద్రబాబు నాయుడు పులివెందుల నియోజకవర్గం పై అనేక విమర్శలు చేశారని, పులివెందుల లో బస్టాండ్ అద్భుతంగా నిర్మిస్తున్నమని, పాత బస్టాండ్ లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నమని, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఇవి కనిపించడం లేద, అబద్ధాలను నిజాలు చేసే ప్రయత్నం టిడిపి నాయకులు చేస్తున్నారని, ఈ జిల్లా ప్రజలు టిడిపి నాయకుల ను నమ్మడం లేదని అన్నారు.
గత ప్రభుత్వం డ్రిప్ కంపెనీలకు డబ్బులు ఇవ్వకుండా చాలా డబ్బులు పెండింగ్ లో పెట్టరని, స్కీమును పూర్తిగా నిర్వీర్యం చేశారని, టిడిపి ప్రభుత్వంలో 900 కోట్లు అప్పును ఈ ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక టిడిపి నాయకులు విమర్శిస్తున్నారని అన్నారు.








Comments