ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఇద్దరు పిల్లలతో సహా!!!
- PRASANNA ANDHRA

- Aug 20, 2022
- 1 min read
అన్నమయ్య జిల్లా, గుర్రంకొండ మండలం పరిధిలో అభం శుభం తెలియని చిన్నారులు ఉదయం అమ్మమ్మ తల్లిదండ్రులు బంధువులతో కలిసి ఆడుకున్నారు..తాగడానికి పాలు తినేందుకు టిఫెన్ కావాలంటూ అల్లరి చేశారు.

అంతలోనే తల్లి మనసుకు ఏం కష్టమొచ్చిందో ఏమో కానీ చిన్నారులతో కలిసి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది..కుటుంబ సభ్యులు చిన్నారులు వారి ఆచూకి కోసం వెతికేలోపే... బావిలో శవాలుగా మారారు.

ఈ సంఘటనతో దిగువ బురుజుపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుర్రంకొండ ఎస్సై దిలీప్‌కుమార్ కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు.








Comments