ముంచుకొస్తున్న 'మోచా'.. తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు..!
- EDITOR

- May 4, 2023
- 1 min read
ముంచుకొస్తున్న 'మోచా'.. తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు..!


అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతన్నలకు మరో పిడుగులాంటి వార్త. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర ఈ వివరాలను వెల్లడించారు. ''మే 6 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశముంది. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీ నాటికి తుపానుగా బలపడే అవకాశముంది. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది'' అని ఆయన తెలిపారు.










Comments