ఎమ్మెల్సీ జన్మదిన వేడుక, ముఖ్య అతిధిగా అంబటి
- PRASANNA ANDHRA

- Jan 16, 2022
- 1 min read

కడపజిల్లా, ప్రొద్దుటూరు స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, అనుచరవర్గం సమక్షంలో ఈరోజు జరుపుకున్నారు, ఆయన అభిమానులు భారీ పూలదండను క్రేన్ సహాయంతో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కి వేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి, రక్తదాన శిబిరానికి ఆయన అభిమాన అనుచరవర్గం పాల్గొనగా, ఒక వర్గం వైసీపీ నేతలు ఎక్కడా కూడా కనిపించలేదు, కాగా తాజా పరిణామాల నేపధ్యంలో MLA వర్గం దూరంగా ఉన్నట్లు సుస్పష్టంగా తెలుస్తోంది, ఈ క్రమంలో ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు అట్టహాసంగానే జరుపుకున్నారు అని చెప్పవచ్చు. ఈ వేడుకలను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు.
కాగా ఈ వేడుకలకు రాష్ట్ర హ్యాండ్ క్రాఫ్ట్ చైర్పర్సన్ బడి గింజల విజయలక్ష్మి, చేనేత పరిశ్రమల మాజీ కమిటీ నెంబర్ బడిగింజల చంద్రమౌళి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వీరాభిమాని తేజస్ రెడ్డి వారి మిత్రబృందం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రాష్ట్ర హ్యాండ్ క్రాఫ్ట్ చైర్పర్సన్ విజయ లక్ష్మి, ఐదో వార్డ్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, శశాంక్ రెడ్డి, బద్వేల్ వాసు రెడ్డి తదితరులు పాల్గొని రమేష్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.











Comments