మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ - RVS
- PRASANNA ANDHRA

- Jan 17, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు : నిన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం పాఠకులకు తెలిసిందే, అయితే ఈరోజు సాయంత్రం MLC రమేష్ యాదవ్ మున్సిపల్ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, నిన్న వస్త్రాలు పంపిణీకి హాజరు కాని వారికి ఇవాళ ఆయన కార్యాలయం ప్రాంగణంలో మహిళలకు చీరలు 200 ఆర్థిక సహాయం అందచేశారు, మగవారికి షర్టు, ఫ్యాంటు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుని వెళతానని, ఇలా ప్రజలకు చేయటం తన భాగ్యంగా భావిస్తున్నానని తెలిపారు.










Comments