top of page

ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సంచలన నిర్ణయం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 13, 2022
  • 1 min read

ప్రభుత్వం నుండి వచ్చే నా జీతం మొత్తం ప్రజాసేవకై ఆర్ వి ఎస్ ట్రస్టుకే


కడపజిల్లా, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వం నుండి ప్రతి నెలా వచ్చే తన జీతం మొత్తం, ప్రతి నెల తాను చేస్తున్న తన సేవా సంస్థ అయిన "ఆర్ వి ఎస్ యువశక్తి సోషల్ సపోర్ట్ అసోసియేషన్" ద్వారా చేస్తున్న కార్యక్రమాల తో పాటు తన జీతాన్ని మొత్తం అదనంగా కలిపి అదికూడా జనవరి అనగా ఈనెల 16 న సంక్రాంతి వేడుకలను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ఆయన ప్రెస్ నోట్ కు తెలియజేయడం జరిగింది, ఇంకా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణంలో కేవలం తన సొంత వార్డు కు అండగా 11వ వార్డు పరిమితమైన ఈ సేవా కార్యక్రమాలు ఈ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈ నెల 16 వ తారీఖున మొదలు ప్రతినెల ఒక వార్డులో తన ట్రస్ట్ కార్యక్రమాలతో పాటు తనకు ప్రభుత్వం నుండి వస్తున్న జీతాన్ని మొత్తాన్ని కలిపి ఆ వార్డులో సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని, అలా ప్రతి నెల ఒక వార్డు చొప్పున ప్రొద్దుటూరు పట్టణంలోని నలభై ఒక్క వార్డులకు ఈ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించి జీవితాన్ని ఇచ్చిన తన తండ్రి పేరు, సమాజంలో ఇంతటి పదవి, గౌరవాన్ని ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ కార్యక్రమం చేపడతానని ఆయన తెలియజేయడం జరిగింది.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page