ఆర్టీవో కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వరద
- PRASANNA ANDHRA

- Aug 21, 2024
- 1 min read
రవాణా శాఖ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వరద

కడప జిల్లా, ప్రొద్దుటూరులోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని ఈరోజు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడి ఎవరైనా అధికారులు లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే ఆర్టీవో ఆఫీస్ బయట ప్రజల వాహనాలు ఎందుకు పార్క్ చేస్తున్నారు? కార్యాలయ ప్రాంగణం లోనికి ఎందుకు రానివ్వడం లేదు అని బ్రేక్ ఇన్స్పెక్టర్ నారాయణ నాయక్ ను ప్రశ్నించారు? అధికారి తాము చెప్పలేదని కార్యాలయానికి వచ్చేవారు అక్కడ వాహనాలను పార్క్ చేసేస్తున్నారని, ఇకపై వాహనాలను లోపలికి రప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. ఈ సందర్భంగా నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, అవినీతి లేని కార్యాలయంగా ఆర్టీవో ప్రాంతీయ కార్యాలయం ఉండాలని అధికారులను కోరారు.











Comments