తనకంటి బ్రదర్స్ కిడ్నాప్ వ్యవహారంలో వసంత్ ఎవరు? - ఎమ్మెల్యే వరద
- EDITOR

- Nov 27
- 1 min read
తనకంటి జ్యువెలర్స్ కిడ్నాప్ వ్యవహారంలో వసంత్ ఎవరు? - ఎమ్మెల్యే వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
సంచలనం సృష్టించిన తనకంటి జ్యువెలర్స్ యజమాని శ్రీనివాసులు అతని సోదరుడు వెంకటస్వామి ఉదంతంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మరోమారు స్పందించారు. సాయంత్రం నెహ్రూ రోడ్డులోని ఆయన కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, తనకంటి సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో వసంత్ కుమార్ అనే మూడవ వ్యక్తి పాత్ర ఏమిటని ప్రశ్నించారు? పట్టణంలో ఇంత జరుగుతున్న డీఎస్పీ అధికారి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ? వసంత్ కుమార్ ఎక్కడ ఉన్నా అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతటితో ఈ విషయాన్ని విస్మరించమని ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే వరద ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఐదో వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు వద్ది బాలుడు పాల్గొన్నారు.








Comments