అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాచమల్లు
- PRASANNA ANDHRA

- Sep 13, 2023
- 1 min read
అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న
ఎమ్మెల్యే రాచమల్లు


వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం, దువ్వూరు రోడ్డు, మంజునాథ కాలనీలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఆయనకు సాగర స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, బుధవారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచకం, అంకురార్పణ, స్వామివారికి విశేష పంచామృతాభిషేకములు, సహస్రనామ పుష్ప పూజ, మహా మంగళహారతి, నైవేద్య వితరణ గలవని, అనంతరం శాంతి హోమం జరుగునున్నట్లు కావున భక్తులు కార్యక్రమాలలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆలయ ధర్మకర్త వరికూటి ఓబుల్ రెడ్డి, రామాంజనేయరెడ్డి, విగ్రహ దాత బాలసుబ్బారెడ్డి, సభ్యులు పాలగిరి లక్ష్మీరెడ్డి, పట్నం సునీల్ కుమార్, నాగరాజా రెడ్డి, సుబ్బారెడ్డి, గోపిరెడ్డి వెంకటరామిరెడ్డి, శివ, నాగభూషణం, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.












Comments