ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు
- PRASANNA ANDHRA

- Feb 1, 2024
- 1 min read
ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గురువారం ఉదయం మరో మారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పై వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతి విమర్శగా సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసాంఘిక కార్యకలాపాలతో తాను ఏనాడు డబ్బులు సంపాదించలేదని, తన అన్న కిరణ్ కుమార్ రెడ్డి వ్యాపారరీత్యా సంపాదించిన డబ్బుతోనే దానధర్మాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వరద ఆరోపించినట్లు తనది అక్రమ సంపాదనైతే తన పుట్టుకునే శంకించవచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎన్నికైన వరద ఎంత సంపాదించారో వెల్లడించాలని, తాను అన్న మాటలు మాజీ ఎమ్మెల్యే వరదకు కూడా వర్తిస్తుందని, అయినా తాను అలా సంస్కారహీనంగా మాట్లాడను అన్నారు. ఇకపై ఇదే తన చివరి హెచ్చరికగా హెచ్చరిస్తున్నట్లు, మరో మారు అక్రమ సంపాదన అంటూ తనను మాట్లాడితే సహించేది లేదంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే వరద తనకు టిడిపి అధిష్టానం టికెట్ కేటాయిస్తుందో లేదో అన్న గందరగోళంలో మాట్లాడుతున్నారని, రానున్న ఎన్నికలలో ప్రజలు తన వైపు ఉన్నారని, దాదాపు 40 వేల ఓట్ల మెజారిటీతో ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే గా హ్యాట్రిక్ సాధించి, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రిత్వ శాఖ కూడా చేపట్టనున్నట్లు ఆయన జోష్యం చెప్పారు.









Comments