నిజాలు నిగ్గు తేల్చాలి - ఎమ్మెల్యే రాచమల్లు
- PRASANNA ANDHRA

- Jun 29, 2023
- 1 min read
నిజాలు నిగ్గు తేల్చాలి - ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలలో నిజాలు నెగ్గు తేల్చాలని లేనిపక్షంలో ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో దీక్ష చేపడతానంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో త్వరలోనే మూడు హత్యలు జరగబోతున్నాయంటూ టిడిపి ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి తనపై, తన పార్టీ వారిపై ఆరోపణలు చేశాడని, ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ జరిపి నిజాలు ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు విచారించి హత్య కాబడే ముగ్గురు వ్యక్తులను కాపాడాలని, ఒకవేళ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసినవి అసత్య ఆరోపణలు అయితే అతనిపై చట్ట పరంగా తగిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి, డిజిపి, కడప ఎస్పీ లకి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాతపూర్వకంగా కోరారు.











Comments