అవినీతికి పాల్పడుతున్న సబ్ రిజిస్టార్ - ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజం
- PRASANNA ANDHRA

- Dec 7, 2023
- 1 min read
అవినీతికి పాల్పడుతున్న సబ్ రిజిస్టార్ - ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
తన ఆస్తులపై టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలకు పత్రికా ముఖ్యంగా సవాల్ విసిరిన అనంతరం, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయ సబ్ రిజిస్టర్ 2 ఎస్. మహమ్మద్ రఫీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు గుప్పించారు. తాను ఉదయం 10:00 నుండి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్లు కొరకు వేచి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 12 కావస్తున్నా ఇక్కడి రిజిస్ట్రార్లు తమ విధులకు హాజరు కాలేదని, అడిగితే కడప కార్యాలయానికి విధులపై వెళ్ళామని చెబుతున్నారన్నారు. సబ్ రిజిస్టర్ రఫీ అవినీతికి పాల్పడుతూ ఇదేమిటని ప్రశ్నించిన వారికి తనకు కడప వైసీపీ బడా నాయకుల అండదండలు ఉన్నట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని. తాను, అలాగే రిజిస్ట్రేషన్ ల కొరకు వచ్చిన ప్రజలు ఉదయం నుండి ఇక్కడ పడిగాపులు కాస్తున్న ఇద్దరు రిజిస్ట్రార్లలో ఒక్కరు కూడా విధులకు హాజరు కాలేదని ఆయన మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బైటాయించి కాసేపు నిరసన తెలియజేశారు. సబ్ రిజిస్టర్ రఫీ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి శాఖపరమైన చర్యలకు ఉపక్రమించమని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై సబ్ రిజిస్టార్ 1 రత్నమ్మను వివరణ కోరగా తాను డి.ఆర్ రిపోర్టు సమర్పించడానికి కడప డివిజనల్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లినట్లు తెలియజేస్తూ, తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను త్రోసిబుచ్చారు.









Comments