top of page

అభిమానుల కోలాహలం నడుమ ఎమ్మెల్యే రాచమల్లు జన్మదిన వేడుకలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 20, 2022
  • 1 min read

అభిమానుల కోలాహలం నడుమ ఎమ్మెల్యే రాచమల్లు జన్మదిన వేడుకలు

ree
ree
ree

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రొద్దుటూరులో ఆయన అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. దొరసాని పల్లెలో ఏర్పాటు చేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని వైసీపీ నాయకులు పాతకోట బలరాం రెడ్డి ఏర్పాటు చేసిన భారీ కేకును కార్యకర్తలు, అభిమానుల నడుమ కట్ చేసి వారితో సంతోషాన్ని పంచుకున్నారు. వైసిపి నాయకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడవ వార్డు నందు దాదాపు వేయి మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే రాచమల్లు హాజరై పలువురికి చీరలు పంపిణీ చేశారు, నూరు కేజీల భారీ కేకును కట్ చేశారు. అనంతరం బిందిలి కార్పొరేషన్ మాజీ చైర్మన్ రసపుత్ర రజిని విశ్వప్రేమ వృద్ధాశ్రమం నందు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆశ్రమం లోని వృద్ధుల నడుమ పుట్టినరోజు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రాచమల్లు అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, కాకర్ల నాగశేషారెడ్డి, ఆచార్ల కాలనీ శివారెడ్డి, రాయపు రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, నాయకురాళ్లు, వైసిపి కౌన్సిలర్లు, రాచమల్లు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page