top of page

సంక్షేమ పథకాల సమస్యలకు సత్వర పరిష్కారం - రాచమల్లు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 23, 2023
  • 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్న సీఎం జగన్‌


ప్రత్యేక క్యాంపులతో పారదర్శకంగా సేవలు - రాచమల్లు

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు
ree

ప్రొద్దుటూరు మున్సిపల్ ఒకటవ వార్డు బొల్లవరంలోని సచివాలయం నందు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గృహ సారథులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సమావేశం ఏర్పాటు చేసి సంక్షేమ పథకాల లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వర పరిష్కార దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా  జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని. ఈ ప్రత్యేక క్యాంపుల్లో ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


FOR VIDEO LINK CLICK HERE

ree

నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, వలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను కూడా సేకరిస్తారు. క్యాంపుల నిర్వహణ సమయంలో వినతుల స్వీకరణ, పరిష్కారం కోసం రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్విసు రిక్వెస్టు డెస్క్‌లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ree

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పందిటి సరోజమ్మ, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, గోన ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page