top of page

ప్రజాసేవకే మా ప్రభుత్వం అంకితం కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 30, 2022
  • 1 min read

గడప గడప కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కొరముట్ల.


ree

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం పార్టీ ఏర్పాటై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని మార్గో పల్లి పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో పర్యటించగా స్థానిక వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.


ree

స్థానిక వైసీపీ నాయకులు, గ్రామ ప్రతినిధులు, మండల అధికారులతో కలిసి ఎమ్మెల్యే కొరముట్ల ప్రతి గడపకు వెళ్లి.. వారు ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధి వివరాలను అడగగా మాకు రావలసినవి చేకూరినవి అంటూ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తపరిచారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలు అంటూ మండల అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో చిట్వేలు మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి, ఎంపీపీ చంద్ర,గ్రామ సర్పంచ్ పెంచల్ రెడ్డి, నాయకులు తిమ్మారెడ్డి , రమణారెడ్డి,దేవరాజు, చొక్కా రెడ్డి,సుధా, నరసింహ, సుబ్బరాయుడు,హజరత్, మండల రెవెన్యూ అధికారి సత్యానందం,మండల ఎంపిడిఓ సమత, ఎస్సై వెంకటేశ్వర్లు, వివిధ శాఖల మండల అధికారులు, కార్యకర్తలు, వాలంటరీ లు, సచివాలయ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page