top of page

రోడ్డు ప్రమాద సుబ్బరాజు కుటుంబాన్ని పరామర్శించిన కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 27, 2022
  • 1 min read

ఏం రాచపల్లి రోడ్డు ప్రమాద కుటుంబాన్ని పరామర్శించిన కొరముట్ల.


--ప్రభుత్వం తరఫున కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ.

--- అండగా ఉంటామన్న స్థానిక వైసిపి నాయకులు.


ree

ఈనెల 16వ తేదీన నంద్యాల జిల్లా పాణ్యం మండలం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం ఎం రాచపల్లి పాండురాజు సుబ్బరాజు, కుమార్ రాజు కుటుంబ సభ్యులను మరియు ఏలూరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇంటికి చేరుకున్న వారి కుమారుడు హరికృష్ణమ రాజును...ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు ఈరోజు సాయంత్రం పరామర్శించి వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


ree

వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందవలసిన భీమా లన్నింటిని త్వరితగతిన అందేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచిస్తూ పిల్లల చదువులకు కుటుంబ పోషణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.



ఇంకా వైసీపీ నాయకులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ఎల్ వి మోహన్ రెడ్డి, మల్లిశెట్టి వెంకటరమణ, చక్రపాణి రెడ్డి,గిరిబాబు రాజు తదితరులు బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.


ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు హేమనవర్మ,రోషన్ జమీర్, నవీన్, చిన్నా రాయల్,హజరత్, నరసింహ,హరి,నాగేశ్వర రాజు,మురళి రాజు,ఈశ్వర్ రాజు,రవీంద్ర రాజు,చెంగల్ రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page