top of page

వై కోట, చిట్వేలు గంగమ్మ జాతర్లలలో కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 12, 2022
  • 1 min read

గంగమ్మ తల్లి జాతర్లలలో ఎమ్మెల్యే కొరముట్ల


--ఘనంగా సత్కరించిన స్థానిక నాయకులు

---జాతర ఏర్పాట్లపై నాయకులను, పోలీసు వారిని అభినందించిన కొరముట్ల.


అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలోని వై కోట మరియు చిట్వేలి గ్రామాలలో ఈ రోజు నిర్వహించిన గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలకి విచ్చేసిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు.

అశేష భక్తజనవాహిని మధ్య అమ్మవారిని దర్శించుకుని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గొప్పగా నిర్వహించిన జాతర నిర్వహణ ఏర్పాట్ల పై పోలీసు వారిని స్థానిక నాయకులను కొరముట్ల ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో చిట్వేలు గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమా మహేశ్వర్ రెడ్డి, చౌడవరం సురేంద్రబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టి. వెంకటరమణ, ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, వైసిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాగేంద్ర, చిట్వేల్ వైసిపి యూత్ కన్వీనర్ నవీన్, రైల్వేకోడూరు ఉపసర్పంచ్ తోట శివసాయి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page