మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ కొరకు దరఖాస్తులు ఆహ్వానం
- EDITOR

- Apr 3, 2023
- 1 min read
మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ కొరకు
దరఖాస్తులు ఆహ్వానం

ప్రసన్న ఆంధ్ర
కేంద్ర ప్రాయోజిత పథకం మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.ఓ నిర్మల సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 18 సంవత్సరముల లోపు రక్షణ లేదా సంరక్షణ అవసరమైన పిల్లలకు విద్య, వైద్యం, అభివృద్ధి అవసరాలను తీర్చడానికి అనుబంధ మద్దతును అందించడం కోసం కేంద్ర ప్రాయోజిత పథకం మిషన్ వాత్సల్య కింద స్పాన్సర్షిప్ ను షరతులతో కూడిన సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ పథకం ద్వారా పిల్లలకు ప్రతి నెలా రూ 4 వేలు చొప్పున అందజేస్తుందని అర్హులైన వారు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని మహిళా పోలీసును సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా బాలల పరిరక్షణ విభాగము సిబ్బందిని రెవిన్యూ డివిజన్ల వారీగా సంప్రదించవచ్చునని తెలియజేశారు.









Comments