జగనన్నే మా భవిష్యత్తు పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి తానేటి వనిత
- PRASANNA ANDHRA

- Apr 5, 2023
- 1 min read
జగనన్నే మా భవిష్యత్తు పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి తానేటి వనిత

‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్నది ప్రజల నినాదమని రాష్ట్ర హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డా. తానేటి వనిత తెలిపారు. హోంమంత్రి వారి కార్యాలయంలో ’జగనన్నే మా భవిష్యత్తు - మా నమ్మకం నువ్వే జగన్’ పోస్టర్ ను బుధవారం నాడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఈ నెల 7న ప్రారంభమవుతుందని, 20 వరకు మొత్తం 14 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజాప్రతినిధులు అంతా ప్రతి ఇంటిని సందర్శించి వారికి ప్రభుత్వం అందించిన సంక్క్షేమాన్ని వివరించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో పార్టీ తరఫున సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల కలిసి ప్రజల అభిప్రాయాలను తీసుకుంటారని తెలిపారు. గత ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ప్రజలకు చెబుదామని పార్టీ కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కొవ్వూరు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.









Jai jagan