మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ను కలసి శుభాకాంక్షలు తెలిపిన ధోనెల ప్రతాప్ యాదవ్
- DORA SWAMY

- Apr 12, 2022
- 1 min read
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ను కలసి శుభాకాంక్షలు తెలిపిన ధోనెల ప్రతాప్ యాదవ్.

నూతన మంత్రివర్గంలో పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి గా ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావును, కడప జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ దోనెల ప్రతాప్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా దోనెల ప్రతాప్ మాట్లాడుతూ యాదవ సంఘ నాయకుడిగా, వ్యాపారవేత్తగా, అభివృద్ధి చెంది రాజకీయాలలో వైసీపీ తరఫున తణుకు నియోజకవర్గ శాసనసభ్యునిగా కొనసాగుతున్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు సేవలను గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన మంత్రి వర్గంలో పౌరసరఫరాల, వినియోగదారుల శాఖలను కేటాయించడం పై హర్షం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర మంత్రి మండలి సభ్యుల అందరికీ దొనేల ప్రతాప్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.








Comments