top of page

మంగంపేట కు విచ్చేసిన రాష్ట్రకార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 17, 2022
  • 1 min read

మంగంపేట కు విచ్చేసిన రాష్ట్రకార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఘనంగా సత్కరించిన

తల్లెం భరత్ కుమార్ రెడ్డి.

ree

అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె మండలం మంగంపేట జాతీయ రహదారి వద్ద ఈ రోజున యువ పారిశ్రామికవేత్త, వైసిపి యువజన నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి తమ అనుచర వర్గం తో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరాం ను శాలువాతో సన్మానించి, పూలమాలలతో సత్కరించారు.


అనంతరం కార్మిక శాఖ మంత్రివర్యులు గా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయనకు స్వీట్ తినిపించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వర్యులు భరత్ కుమార్ రెడ్డికి తన అనుచర వర్గానికి ఇంతటి అభిమానాన్ని ఆప్యాయతను చూపించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం మంత్రి హోదాలో మంగంపేట కు రావడం చాలా సంతోషంగా ఉందని, అంతేకాకుండా భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరారు.


ఈ కార్యక్రమం లో వాల్మీకి శ్రీనివాసులు, వాల్మీకి మల్లికార్జున,దేవేంద్ర భాస్కర, లక్ష్మయ్య,హరికృష్ణ, కిరణ్,రాముడు, ఆనంద్, రమణ, వెంకటేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page