top of page

చంద్రబాబుకు మద్దతుగా టిడిపి నాయకుల దీక్షలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 15, 2023
  • 1 min read

చంద్రబాబు విడుదలయ్యేవరకు మా దీక్షలు కొనసాగిస్తాం.

ree

పాలకపక్షం అక్కసుతో, ఖైదీ చేయబడ్డ ప్రతిపక్ష నేత టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలయ్యేంతవరకు ఆయనకు మద్దతుగా మా దీక్షలు కొనసాగిస్తామని టిడిపి తెలుగు సాంస్కృతిక విభాగ అధ్యక్షులు నరసింహ ప్రసాద్ అన్నారు.

గురువారం చిట్వేలి ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు లారీ సుబ్బరాయుడు, బాలు రామాంజనేయులు, కాకర్ల నాగార్జున ఆధ్వర్యంలో చేపట్టిన "మేము సైతం బాబుకు తోడు" అన్న కార్యక్రమంలో పాల్గొని తన సంఘీభావం ప్రకటించారు. తాను తన బంధువులు చేసిన తప్పిదాలను కప్పిపెట్టి, ప్రజా ఆదరణ పుంజుకుంటున్న టిడిపి పై కక్ష కట్టి ఆధారాలు లేని కేసులను పెట్టి చంద్రబాబును జైల్లో పెట్టడం ఎంతవరకు సబబు..?? అని వారు ప్రశ్నించారు. వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమాలు మరింత బలోపేతం చేస్తామని హెచ్చరించారు. తోడుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసైనికులు తోడవడం సంతోష విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో.

ree

మన్నూరు సత్యనారాయణ, ఎంపీటీసీ శ్రీనివాసులు, తుంగా.పిచ్చయ్య, బిసి నాయకులు డేరంగుల వెంకటేష్, ధనంజయ, కాకర్ల కోటేశ్వర రావు, బాలు రేడ్డయ్య, మాచినేని రవీంద్ర, జనసేన నాయకులు మాదాసు నరసింహ,యువత మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page