ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు.
- DORA SWAMY

- Aug 22, 2022
- 1 min read
Updated: Aug 23, 2022
చిట్వేల్ మండలంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు.
---ఎస్టీ కాలనీవాసుల మధ్య జన్మదిన వేడుకలు.
--దుప్పట్లు, అన్నదానం పంపిణీ చేసిన జనసేనానులు,అభిమానులు.

చిట్వేలు మండలం చిరంజీవి యువత అధ్యక్షులు తుపాకుల పెంచలయ్య, పగడాల శివ, పురం సురేష్ ఆధ్వర్యంలో..

మారుమూల గిరిజన కాలనీ అయిన ఇందిరమ్మ ఎస్టీ కాలనీ లో 40 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాపు సంక్షేమ సేన కడప ,అన్నమయ్య జిల్లాల ఉమ్మడి కోఆర్డినేటర్ మస్తాన్ రాయల్ మరియు ఉమ్మడి కడప జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు మాదాసు నరసింహ విచ్చేశారు.
ఈ సందర్భంగా మస్తాన్ రాయల్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేదలకు సహాయం చేయడం కోసం తమ వంతుగా ఎల్ల వేళల కృషి చేస్తామని తెలిపారు, అలాగే సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గిరిజనులు చేత కేక్ కటింగ్ చేపించి మిఠాయిలు పంచుకుని ఆనందంగా జరుపుకున్నారు.
మాదాసు నరసింహ మాట్లాడుతూ.. సేవ చేయడానికి అధికారం అవసరం లేదని, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ ఇలా చేతల్లో చేసి నిరూపించిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని అన్నారు. గిరిజన వాసులు చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే తమను గుర్తించి ఇంత దూరం వచ్చి సహయం అందించిన జనసేన పార్టీ నాయకులకు మరియు చిరంజీవి అభిమానుల కు గిరిజనులు ధన్యవాదాలు తెలియజేసారు.

కాగా చిట్వేలు చిరంజీవి యువత పట్టణ అధ్యక్షుడు పగడాల శివ ఆధ్వర్యంలో రాజారెడ్డి ఎస్టి కాలనీలో భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు కంచర్ల సుధీర్ రెడ్డి, కడుమూరి నాగరాజా,మాదాసు శివ, మురళీకృష్ణ, కడుమూరి సుబ్రహ్మణ్యం, కొని శెట్టి చక్రి, నాగిశెట్టి నాగేంద్ర, చిరంజీవి, సువ్వారపు భానుప్రకాశ్, సువ్వారపు హరిప్రసాద్, తుపాకుల శివ, నవీన్, తుపాకుల నాగరాజా,పల్లప్ప తదితరులు పాల్గొన్నారు.




















Comments