top of page

చంద్రబాబు నాయుడు కు బైయిల్ రావడం చారిత్రక విజయం - మేడా విజయ శేఖర్ రెడ్డ

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 20, 2023
  • 1 min read

చంద్ర బాబు నాయుడు కు బైయిల్ రావడం చారిత్రక విజయం - రాజంపేట నియోజక వర్గ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి

ree
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మేడా విజయ శేఖర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కు స్కిల్స్ డెవలప్మెంట్ కేసులో పూర్తిగా బెయిల్ రావడం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో విజయం సాధించామని రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నో అక్రమ కేసులను బనాయించి ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇదొక గుణపాఠం అని ఆయన అన్నారు. దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ ను ఎంతో పేరు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుని , అభివృద్ధికి మారుపేరు అని ఆయన అన్నారు. తెలుగు దేశం అధికారంలో ఉన్న సమయంలో పేదల మరియు మధ్యతరగతి ప్రజల కోసం ఇసుకను అతి తక్కువ ధరతో విక్రయించేదని నేడు పేదలు మధ్యతరగతులు ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక రేటు ఐరన్ రేట్లు చూసి బాంబేలు ఎత్తుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జగనన్న నివాసాలలో ఇంతవరకు 50 శాతం కూడా నిర్మాణాలు పూర్తి కాలేదని వీటిపై చర్చకు సిద్ధమా అని ఆయన అన్నారు. ప్రచారాలు మాత్రం భారీగా చేస్తున్నారు కానీ పనులు అనేటివి జరగడంలేదని పబ్లిసిటీకి పెట్టే ఖర్చులో సగమైన రాష్ట్ర అభివృద్ధికి పెడితే బాగుంటుంది అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్లిందని స్వలాభం కోసం అధికార పార్టీ నాయకులు పనిచేస్తున్నారు తప్ప పేదలకు మధ్యతరగతి వారికి ఎటువంటి అభివృద్ధి అనేది లేదని దుయ్యబట్టారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page