top of page

మున్సిపల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 11న చలో విజయవాడ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 10, 2022
  • 1 min read

Updated: Mar 11, 2022


ree

రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి వరకు 11వ వేతన సవరణ కమిటీ కి సంబంధించిన ఆశితోష్ మిశ్రా కమిషన్ నివేదికను బయట పెట్టకుండా ఉద్యోగులు, కార్మికులను వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం అవమానించింది. అవుట్ సోర్సింగ్ కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.20000/-లు మరియు కరువుభత్యం (డిఏ )ను ఆశితోష్ మిశ్రా కమిటీ రిఖమెండ్ చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ లోని కా‌ర్మికులకు కేవలం రూ.15000?-లు జీతం మాత్రమే నిర్ణయించడం కరువుభత్యం ఊసే లేకపోవడం లక్షలాదిమంది కార్మికులకు ద్రోహం చేయడాన్ని ఎ పి మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నది.

అవుట్ సోర్సింగ్ కార్మికులకు సమానపనికి సమానవేతనం చెల్లించాలని సుప్రీం కోర్టు హైకోర్టు. లు పలం కేసులలో తీ‌ర్పులనిచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి అనేక వేదికల మీద తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమానపనికి సమానవేతనం అమలు చేస్తామని ప్రకటించారు. కానీ ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కి అవుట్ సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు అన్యాయం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం యొక్క వినాశకర వైఖరి వల్ల ఒక్కో కార్మికుడి కుటుంబం నెలకు రూ 5000/-లు ఏడాదికి 60వేల రూపాయలు నష్టపోతున్నారు. పైగా 2018 జూలై నుండి జీతాలు పెంచి చెల్లించాల్సి వుండగా 2022 నుండి చెల్లించడం వల్ల ఒక్కో కార్మికుడు గత మూడున్నరేళ్ల లో 3 లక్షల 36 వేలు నష్టపోయారు. ఇంత పెద్ద ఎత్తున మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మున్సిపల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మార్చి 11 చలో విజయవాడకు తరలిరావలసిందిగా కోరారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page