top of page

అర్హతనే ప్రామాణికంగా రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు - వై. బాలనాగిరెడ్డి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 8, 2022
  • 1 min read

అర్హతనే ప్రామాణికంగా రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు

- గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు వై. బాలనాగిరెడ్డి.

ree

మంత్రాలయం :

లబ్దిదారులకు అర్హతనే ప్రామాణికంగా రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు వై. బాలనాగిరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని 52బసాపురం గ్రామ సచివాలయం పరిధిలో చిరు జల్లులు కురుస్తున్న గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల బుక్ లెట్ ను అందజేసి పథకాల వివరాలను చదివి వినిపిస్తు గడగడపకు కు వెళ్లారు.

గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాగా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా గ్రామంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం ను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే విధంగా గ్రామంలో నిర్మాణం లో ఉన్న సచివాలయ భవనంను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం సచివాలయంను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, నాయకులు కాంత రెడ్డి, సర్పంచ్ రాఘవరెడ్డి, తహసీల్దార్ చంద్ర శేఖర్, ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వేద స్వరూప, ఏపియం జయశ్రీ, ఇన్ చార్జ్ ఎంపీడీఓ /ఈవోపీఆర్డి ప్రభావతి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ నాగలక్మి , ట్రాన్స్ కో గోవిందు, మండల విద్యాధికారి మోహనుద్దీన్, పీఆర్ జేఈ నర్సింహులు, ఏపివో తిమ్మారెడ్డి, ఆర్ఐ ఆదామ్ తదితరులు ఉన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page