top of page

అంధులకు ఆర్ధిక సాయం, ఊత కర్రల అందచేత

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 1, 2023
  • 1 min read

అంధులకు ఆర్ధిక సాయం, ఊత కర్రల అందచేత - మానవతా స్వచ్చంద సేవా సంస్థ

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


బుధవారం ఉదయం మానవతా స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ కళావతి అధ్యక్షతన ప్రతి నెలా ఒకటవ తారీఖున అంధులకు అందించే ఆర్ధిక సహాయాన్ని దాతలు సన్నుతి శ్రీనివాసులు, పల్లా లీల, బాడిగించల నాగరాజు, ముత్యాలపాటి శేషగిరి రావు, మురహరి జగదీష్ ల ఆర్ధిక సహాయ సహకారాలతో స్థానిక సరస్వతి విద్యా మందిరం, కుమ్మర కొట్టాల నందు దాదాపు నలబై రెండు మంది అంధులకు ఎనిమిది వొందల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం, అలాగే వంకదార శ్రీధర్, పార్ధసారధి, తోడియం శెట్టి సుబ్బారాయుడు లు ఆర్ధిక సహాయం అందిచగా అంధులకు ఊత కర్రలు అందచేశారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్వీ రమణా రెడ్డి, ప్రొద్దుటూరు సంస్థ అధ్యక్షుడు సన్నుతి శ్రీనివాస్, శ్రీధర్, రమేష్, దేవానంద్, సుజాత, నారాయణ రెడ్డి, సుబ్బా రెడ్డి, ఉపేంద్ర, సుబ్బనరసయ్య, శివారెడ్డి, మురళీధర్ రెడ్డి, నిర్మల, అఖిలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page