top of page

ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన మల్లిశెట్టి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 9, 2023
  • 1 min read

ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన మల్లిశెట్టి.

----పలు విషయాల పై చర్చ-గెలుపు పై ధీమా-పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించిన ముఖ్యమంత్రి.

ree

డాక్టర్ వైయస్సార్ జయంతి సందర్భంగా పులివెందులకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టి వెంకటరమణ, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు లు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తో కలిసి శనివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చం అందించినట్లు మల్లిశెట్టి తెలిపారు.

ree

ఈ సందర్భంగా పలు విషయాలను గూర్చి ముఖ్యమంత్రితో చర్చించినట్లు రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి సహాయపడాలని కోరినట్లు మల్లిశెట్టి తెలిపారు. ప్రతి ఇంటా ప్రజలకు చేకూరుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిని వ్యక్తపరుస్తున్నట్లు, రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మీకు రానున్న ఎన్నికల్లో గెలుపు తధ్యమని తెలపడంతో ముఖ్యమంత్రి స్పందిచి చిరునవ్వు నవ్వుతూ దగ్గరకు పిలిచి, భుజం తట్టి గుడ్ లక్ రమణ అన్నారని మల్లిశెట్టి తెలిపారు.

ree

2024 ఎన్నికల్లో పార్టీ 175 స్థానాల్లో గెలుపొందే దిశగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు మలిశెట్టి వెంకటరమణ తెలియపరిచారు. ముఖ్యమంత్రి పలకరించిన తీరు తనలో నూతన ఉత్తేజాన్ని, సంతృప్తిని కలిగించాయని మల్లిశెట్టి అన్నారు. తదుపరి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులతో కలసి పలు అంశాలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించినట్లు మల్లి శెట్టి వివరించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page