top of page

మహిళా కమిషన్ సభ్యురాలుగా గెడ్డం ఉమ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 4, 2022
  • 1 min read

విశాఖపట్నం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖ నగరానికి చెందిన సామాజిక కార్యకర్త గెడ్డం ఉమ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అనూరాధ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గెడ్డం ఉమ ఐదేళ్ళ పాటు మహిళా కమిషన్ సభ్యురాలి పదవిలో కొనసాగుతారు. గతంలో వ్యక్తిగత భద్రత, క్యాన్సర్ అవేర్ నెస్ తదితర అంశాలపై పాఠశాలల్లో తరగతులు చేపట్టారు. అలాగే సామాజిక అంశాలపై సమయానుగుణంగా స్పందించడం, వ్యక్తిత్వ వికాసంపై కళాశాలల్లో చేపట్టిన కార్యక్రమాలను చూసి గెడ్డం ఉమను మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రభుత్వం నియమించింది. తన నియామకం పట్ల గడ్డం ఉమ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళా హక్కుల పరిరక్షణ పట్ల బాధ్యతగా మెలుగుతానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మలకు గెడ్డం ఉమ కృతజ్ఞతలు తెలిపారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page