‘మహర్షి’ సినిమా రైతు పాత్రలో పెద్దాయన
- PRASANNA ANDHRA

- Sep 9, 2022
- 1 min read
సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీలో రైతు పాత్రలో అద్భుతంగా నటించిన గురుస్వామి ఈ రోజు సాయంత్రం కర్నూలు లో తుదిశ్వాస విడిచారు. గత కొద్దీ కాలం గా అనారోగ్య సమస్యలతో ఆయన కాలం చేశారు అని కుటుంబ సభ్యులు తెలిపారు . గత ఏడాది వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన.. ‘మహర్షి’ మూవీని కీ టర్న్ చేసే రోల్‌లో మెప్పించారు గురుస్వామి.

మహేశ్ బాబు పక్కనే ఉండగా.. ఎమోషనల్ డైలాగ్స్‌ను అలవోకగా చెప్పి.. ఆకట్టుకున్నారు. పంచెకట్టులో తలపాగ చుట్టుకుని… భుజంపై నాగలితో రైతు అంటే ఇలాగే ఉంటారా అన్నంతగా.. ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా మట్టికి, రైతుకు మధ్య బంధాన్ని చెప్పే క్రమంలో ఆయన నటన అద్భుతం..మహర్షి అనంతరం కూడా పలు సినిమాల్లో నటించారు. గురుస్వామి స్వస్థలం కర్నూలు జిల్లా వెల్దుర్తి. ఆయన స్టేజ్ ఆర్టిస్ట్. ఉద్యోగం చేస్తూనే నాటక రంగంలో రాణించారు. ఆయన మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.








Comments