top of page

సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి - ఎల్.వి మోహన్ రెడ్డి , ఎస్ఐ వెంకటేశ్వర్లు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 3, 2022
  • 1 min read

సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి - చలివేంద్ర ప్రారంభంలో : ఎల్.వి మోహన్ రెడ్డి , స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు.

ree

ఈరోజు ఉదయం చిట్వేలు మండలం లోని ప్రధాన రహదారి పోస్ట్ ఆఫీస్ సమీపంలో కీర్తిశేషులు పడాల రామసుబ్బయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు శివ, గణేష్ , భరత్ ఆధ్వర్యంలో లో చేపట్టిన చలివేంద్రాన్ని మండల సీనియర్ వైసిపి నాయకులు ఎల్ మోహన్ రెడ్డి మరియు స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు కలసి ప్రారంభించారు.

ree

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిట్వేలి మండలానికి అనేక అవసరాల నిమిత్తం అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో జనాభా వస్తూ ఉంటారని ; ఎండలు విపరీతంగా ఉండటం వల్ల కొంతమందికైనా మంచి నీటిని అందించి వారి దాహాన్ని తీర్చడంలో ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యంగా యువత ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ముందుండాలని చూసిస్తూ కార్యనిర్వహకులను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండలంలోని యువత అధిక సంఖ్య లో పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page