top of page

అభిమానుల జనసందోహం మధ్య ఎల్.వి మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 8, 2022
  • 1 min read

అభిమానుల నడుమ ఎల్ వి మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు - అన్నదానం నిర్వహించిన అభిమానులు.

ree

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని చిట్వేలు మండలం దేవమాచుపల్లి కి చెందిన వైసిపి సీనియర్ నాయకులు మరియు సదరు గ్రామ సర్పంచ్ ఎల్ వి మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి వివిధ పార్టీల నాయకులు, అధికారులు, ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


తన అనుచర అభిమానుల నడుమ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన నాయకుడు మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని తాను ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఎల్ వి మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

ree

ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చంద్ర, తిమ్మయపలెం సర్పంచ్ బాలు, సింగర హరిప్రసాద్, జాకీర్, గణేష్ కుమార్, వెంకట్ సుబ్బారెడ్డి, సుబ్బారాయుడు, చిన్న,నాగేంద్ర,మరియు మోహన్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.


పేదలకు అన్నదానం - తమ నాయకుని జన్మదినం సందర్భంగా అభిమానులు మధ్యాహ్నం చిట్వేలు లోని నిరుపేదలు, యాచకులకు, అనాధలకు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ree

ఈ కార్యక్రమంలో మానవత సభ్యులు ముని రావు, చౌడవరం మురళి,పగడాల గణేష్ కుమార్, సుధీర్ రెడ్డి, పగడాల శివ, సుబ్రమణ్యం, శింగనమల యూత్ పాల్గొన్నారు..

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page