లగడపాటి రీ ఎంట్రీ...?
- PRASANNA ANDHRA

- Apr 24, 2022
- 1 min read
రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీ...?

ఎన్ టి ఆర్ జిల్లా, నందిగామ సమైఖ్యాంద్ర ఉద్యమం లో రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి రాజగోపాల్ మళ్ళీ రాజకీయాల్లోకి రానున్నారా...? కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి 2024 ఎన్నికల లడాయు కి సిద్ధం గా ఉన్నారా..? రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన రాజగోపాల్ ఇప్పుడు రి ఎంట్రీ ఇవ్వనున్నారా.? ఐతే వైస్సార్సీపీ తరపున విజయవాడ పార్లమెంట్ స్థానానికి మళ్ళీ పోటీ చెయ్యనున్నారా.? అందుకే మైలవరం ఎం ఎల్ ఏ కృష్ణప్రసాద్ తో, నందిగామ వైసీపీ నేతలతో సమావేశం అయ్యారా..? అవును అనే చెబుతున్నాయి వైసీపీ నాయకులతో లగడపాటి సమావేశాలు. ఏ కార్యక్రమం జరిగినా పరామర్శ పేరుతో వాలిపోతున్న లగడపాటి. నందిగామ లో అనుచరుడు పాలేటి సతీష్ నివాసం లో వైసీపీ నేతల తో వసంత కృష్ణ ప్రసాద్ తో కలసి సమావేశం అయ్యారు. తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటించనున్నట్లు నందిగామ వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.... చూడాలి మరి ఏ పార్టీ కి వెళతారో.








Comments