నటుడు కృష్ణంరాజు ఇకలేరు
- PRASANNA ANDHRA

- Sep 11, 2022
- 1 min read

ప్రముఖ నటుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు ఈ ఉదయం తెల్లవారుజామున(83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.1940 జనవరి 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కృష్ణంరాజు జన్మించారు.వాజ‌్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా చేసిన కృష్ణంరాజు... తెలుగు చిత్రసీమలో రెబెల్ స్టార్‌గా పేరొందారు.తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించాడు.ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు.ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ, అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.








Comments