top of page

చిట్వేలి లో కాంతితో క్రాంతి కార్యక్రమం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Oct 7, 2023
  • 1 min read

చిట్వేలి లో కాంతితో క్రాంతి కార్యక్రమం.

అరెస్ట్ ముమ్మాటికి కక్షపూరిత చర్య

కాకర్ల నాగార్జున.

ree

టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ... టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,యువ నాయకులు నారా లోకేష్ పిలుపుమేరకు చిట్వేలు మండల వ్యాప్తంగా శనివారం రాత్రి "క్రాంతి తో కాంతి" కార్యక్రమాన్ని టిడిపి,జనసేన నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించారు.

కాగా మండల టిడిపి యువ నాయకులు కాకర్ల నాగార్జున ఆధ్వర్యంలో సి.కందులవారి పల్లెలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ...

వందలాది కోట్లు దోచుకున్నారని నెపంతో ఆధారాలు నిరూపించలేని అక్రమ కేసులు బునాయించి 28 రోజులు గడుస్తున్నప్పటికీ వాటిని నిరూపించలేక... కేవలం పార్టీ కోసం వచ్చిన విరాళాలను అక్రమంగా వచ్చాయనడం వైసిపి ప్రభుత్వానికే చెల్లుతుందని దుయ్యబట్టారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపేనన్నారు. దీనిని గమనిస్తున్న యావత్ రాష్ట్ర ప్రజలు ఈరోజు మా నాయకుడికి మద్దతుగా కొవ్వొత్తులు టార్చ్ లతో కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామం అన్నారు. టిడిపి జనసేన ల సమైక్య విజయాన్ని ఎవరు ఆపలేరనీ పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమం లో బాలు రామాంజనేయులు, బాలు రెడ్డయ్య, కాకర్ల కోటేశ్వరరావు, తుంగా చిన్నయ్య, కస్తూరి చంద్రయ్య, మహిళలు గ్రామస్తులు పాల్గున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page