కొత్తపల్లె పంచాయతీ అభివృద్ధి పనులకు ఆటంకం
- PRASANNA ANDHRA

- Feb 23, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దటూరు కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు బొంగు బజార్ ప్రాంతంలో కాలువల ఆధునీకరణలో భాగంగా నేడు కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రా రెడ్డి ఆధ్వర్యంలో కాలువల ఆధునీకరణ, పూడిక తీత, ఆక్రమిత కాలువల నిర్మాణ పనులను ప్రారంభించగా అడ్డుకొన్న YSRTP కడప జిల్లా అధ్యక్షుడు షేక్ షా వల్లి అడ్డుకున్నారు, వక్స్ భూముల పరిధిలోకి తమ అంగళ్ళు వస్తాయని, ఇక్కడ ఎలా కాలువలు వస్తాయని ప్రశ్నించారు, కాసేపు కొనిరెడ్డి, షేక్ షా వల్లి మధ్య వాగ్వివాదం జరిగింది, సమాచారం అందుకున్న రురల్ పోలీసులు గొడవను సద్దుమణిగించారు. తాత్కాలికంగా షేక్ షా వల్లి షాప్ వరకు కాలువ నిర్మాణ పనులు చేపట్టాలని, ఇరువురితో మాట్లాడి మంగళవారం వరకు పనుల నిలుపుదలకు ఒప్పించారు.









Comments